Author Topic: పవన్‌‌కు తమ్ముళ్లు దొరికారు!  (Read 80 times)

Offline pkraja

  • Newbie
  • *
  • Posts: 2
  • Megafan
    • We Love Pawankalyan
చాలా రోజుల విరామం తర్వాత పవన్‌ నటిస్తున్న సినిమా ‘కాటమరాయుడు’. డాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తమిళ ‘వీరమ్‌’కు రీమేక్‌ అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కథానుసారం పవన్‌కు ముగ్గురు తమ్ముళ్లు ఉంటారు.
 pawan-brothers
ఈ పాత్రల కోసం విజయ్‌ దేవరకొండ, రాజ్‌తరుణ్‌, సాయిధరమ్‌ వంటి హీరోలను సంప్రదించారు అనే రూమర్లు కూడా ఇప్పటివరకు వినిపించాయి. అయితే ఈ సినిమాలో పవన్‌ తమ్ముళ్లుగా నటించేదెవరో ఇప్పుడు బయటకు వచ్చింది. పవన్‌ ముగ్గురు తమ్ముళ్ల పాత్రలకు అజయ్‌, శివబాలాజీ, కమల్‌ కామరాజ్‌లను చిత్ర యూనిట్‌ ఎంపిక చేసింది. ‘గబ్బర్‌సింగ్‌’ సినిమాలో అజయ్‌ ఇదివరకే పవన్‌తో కలిసి పనిచేశాడు. ఇక, ‘అన్నవరం’ సినిమాలో పవన్‌తో కలిసి నటించాడు శివబాలాజీ. కమల్‌ కామరాజ్‌కు మాత్రం పవన్‌తో పనిచేయడం ఇదే మొదటిసారి. ఈ సినిమాలో పవన్‌ సరసన శృతీహాసన్‌ నటిస్తున్న విషయం తెలిసిందే.

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
8 Replies 916 Views Last post June 27, 2012, 07:48:24 AM
by haribabu015
10 Replies 1105 Views Last post August 04, 2012, 05:43:59 PM
by pawanist
0 Replies 376 Views Last post March 13, 2014, 02:14:04 PM
by lokesh
0 Replies 268 Views Last post April 22, 2014, 04:00:16 PM
by siva
0 Replies 278 Views Last post October 18, 2014, 07:25:36 AM
by siva