Chiranjeevi paid his last respects to noted lyricist Jaladi who passed away yesterday.
He remembered Jaladi’s lyrics and how effective his words were.
Jaladi wrote lyrics for Chiru’s first movie ‘Pranam Khareedu’ and many more later.
జాలాది అనగానే ‘యాతమేసి తోడినా ఏరు ఎండదు’, ‘పుణ్యభూమి నా దేశం నమో నమామి’ పాటలే గుర్తొస్తాయి. జానపద గేయరచనలో ఆయన శైలి విశిష్టమైనది. జాలాది పూర్తిపేరు జాలాది రాజారావు. 1932 ఆగస్టు 9న కృష్ణాజిల్లా దొండపాడు గ్రామంలో జన్మించిన ఆయన బడిపంతులుగా తన కెరీర్ ఆరంభించారు. రంగంస్థలంపై కూడా మెరుపులు మెరిపించిన ఆయన 1970లో మద్రాసు వెళ్లి కొంతకాలం ఘోస్ట్ రైటర్‌గా పనిచేశారు. ‘పల్లెసీమ’ సినిమాతో పీసీ రెడ్డి ఆయనను గేయరచయితగా పరిచయం చేశారు.
‘ప్రాణం ఖరీదు’లోని ‘యాతమేసి’ పాట జాలాదిని పాపులర్ చేసింది. సుమారు 275 సినిమాల్లో ఎన్నో విలువైన పాటలు రాశారు. ‘మేజర్ చంద్రకాంత్’లోని ‘పుణ్యభూమి నా దేశం’ పాట ఆయన కీర్తి కిరీటంలో మరువలేనిది. ఈ పాటకు జాతీయ పురస్కారం లభిస్తుందని అందరూ భావించారు. కానీ ఆ పాటకు పురస్కారం రాకుండా కొంతమంది పనికట్టుకుని ఆపేసారనే బాధను జాలాది పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు.
‘ఎర్రమందారం’లోని ‘యాలో యాలో ఉయ్యాలో’ (1991) పాట ఆయనకు నంది అవార్డును తెచ్చిపెట్టింది. ఆంధ్రా యూనివర్శిటీ నుంచి ‘కళాప్రపూర్ణ’ స్వీకరించారు. ‘చేతి చిటికెనవేళ్లు కలిస్తే కల్యాణం… కాలి బొటనవేలు కలిస్తే నిర్యాణం’ అనే జీవిత సత్యాన్ని రెండే రెండు వాక్యాల్లో చెప్పినా, ‘కన్ను తెరిస్తే ఉయ్యాలా.. కన్ను మూస్తే మొయ్యాలా’… అని మానవ జీవిత సత్యాన్ని ఆవిష్కరించినా ఆయనకే చెల్లింది. ‘ఈ కాలం పదికాలాలు బతకాలి’ అంటూ తన పాట ద్వారా కాలాన్నే ఆశీర్వదించిన కవి పుంగవుడు జాలాది.
Chiranjeevi also remembered Salim Master, who passed away last evening.
Salim master has composed dances for chiru’s movies in 1980s like khaidi, abhilasha etc.
ఎన్టీఆర్… ఎమ్జీఆర్… ఏయన్నార్… కృష్ణ… కృష్ణంరాజు… రజనీకాంత్… కమల్‌హాసన్… చిరంజీవి… బాలకృష్ణ… మోహన్‌బాబు… ఇలాంటి మహామహులతో స్టెప్పులేయించిన ఘనుడు సలీమ్. అంతకుముందూ కొరియోగ్రాఫర్లు ఉన్నారు. ఆయనతో పాటు చాలామంది వచ్చారు. కానీ సలీమ్ ఒక్కడికే స్టార్‌హోదా దక్కింది. ఏంటి సలీమ్ స్పెషాలిటీ? తన స్టెప్పుల్లో మెరుపు రాజుకుంటుంది. పిడుగు కమ్ముకుంటుంది. సముద్రకెరటాల్లాంటి స్టెప్స్. తెరమీద హీరో, హీరోయిన్లు కదులుతుంటే ప్రేక్షకులకు పూనకమే పూనకం. ఎలాంటి స్టెప్ వేయిస్తే మాస్ విజిల్ వేస్తుందో సలీమ్‌కు బాగా తెలుసు. ఏ హీరో బాడీ లాంగ్వేజ్‌కి ఏ స్టెప్ సూటబుల్ అనేది సలీమ్‌కి మాత్రమే తెలిసిన ఆర్ట్. చిన్న మూమెంట్… చిన్న జర్క్… కొంచెం మసాలా… ఏదో మేజిక్. చూస్తున్న ప్రేక్షకుని ఒంట్లో కరెంట్ పాసయిపోతుంది. సలీమ్‌కే తెలిసిన టెక్నిక్ అది. ఒకటారెండా వందల సినిమాలు. ఒంటి కాలితో చేసి పారేశాడు. జయమాలిని, జ్యోతిలక్ష్మి లాంటి ఫేమస్ డాన్సర్ల పాటలను కూడా హాఫ్‌డేలో ఫినిష్ చేసి పారేసేవాడు.
కొన్ని సూపర్‌హిట్ డ్యాన్స్ నంబర్స్
1. ఎన్టీఆర్- వేటగాడు- ఆకుచాటు పిందె తడిసె..
2. ఏఎన్నార్- {పేమాభిషేకం- నా కళ్లు చెబుతున్నాయి
3. కృష్ణ- ఊరికి మొనగాడు- ఇదిగో తెల్లచీర
4. చిరంజీవి- ఖైదీ- రగులుతోంది మొగలిపొద
5. శోభన్‌బాబు- దేవత- వెల్లువొచ్చి గోదారమ్మ
6. బాలకృష్ణ – అనసూయమ్మగారి అల్లుడు – తళుకు తాంబూలమిస్తా
7. కృష్ణంరాజు బెబ్బులి- కంచిపట్టు చీరలోన
8. నాగార్జున- విక్రమ్- నీవే రాగం
9. వెంకటేశ్ – కలియుగ పాండవులు – ఒక పాపకు పదహారేళ్లు








